pelli Prudhvi Raj: 'సీతారామయ్యగారి మనవరాలు' సెట్లో 'రాస్కెల్.. గెటవుట్' అన్నారాయన!: 'పెళ్లి' పృథ్వీరాజ్
- క్రాంతికుమార్ గారు తొలి అవకాశం ఇచ్చారు
- నన్ను చూడగానే ఆయనకి కోపం వచ్చేసింది
- గెడ్డం కారణంగా ఛాన్స్ పోయింది
తెలుగు .. తమిళ.. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విభిన్నమైన పాత్రలను చేస్తూ, నటుడిగా పృథ్వీరాజ్ మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తనకి జరిగిన ఒక అవమానం గురించి ప్రస్తావించారు. "తెలుగులో నాకు తొలి అవకాశం 'సీతారామయ్య గారి మనవరాలు' సినిమాతో వచ్చింది. 'మీనా'కు అది తొలి సినిమా అంటూ దర్శకుడు క్రాంతికుమార్ నాకు పరిచయం చేశారు. హైదరాబాదులో 40 రోజుల పాటు షూటింగు ఉంటుందని అన్నారు.
షూటింగు మొదలుకావడానికి కొన్ని రోజులముందు క్రాంతికుమార్ గారికి కనిపిస్తే, 'నీ గెడ్డం బాగుందయ్యా' అన్నారు. ఈ మధ్య షూటింగులేమీ లేవు కదా సార్ .. అందుకే పెంచాను' అన్నాను. ఆ తరువాత ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఫస్టు డే నేను సెట్లోకి అడుగుపెడుతుండగానే క్రాంతికుమార్ గారు చూసి .. 'గెటవుట్ .. యు రాస్కెల్' అంటూ అరిచారు. నేను ఒక్కసారిగా బిత్తరపోతూ .. 'ఎవరిని సార్ ' అన్నాను. 'నిన్నే .. రాస్కెల్ .. నిన్ను ఎవరు గెడ్డం తీయమన్నారు? అన్నారు. 'అవసరమైతే గెడ్డం పెట్టుకోవచ్చు సార్' అన్నాను. ''ఫస్టు .. గెటవుట్' అంటూ మళ్లీ గట్టిగా అరిచారు. అలా గెడ్డం కారణంగా ఆ సినిమాలో ఛాన్స్ పోయింది .. అని చెప్పుకొచ్చారు.