Mahesh Babu: మహేశ్ మూవీ కోసం విజయశాంతితో అనిల్ రావిపూడి సంప్రదింపులు?

  • మహేశ్ బాబు 26వ సినిమాకి సన్నాహాలు 
  • సున్నితంగా తిరస్కరించిన ఉపేంద్ర 
  • రాజకీయాల్లో బిజీగా విజయశాంతి

ఒక వైపున మహేశ్ బాబు 25వ సినిమాగా 'మహర్షి' ముగింపు దశకి చేరుకుంది. మరో వైపున ఆయన 26వ సినిమాకి సంబంధించిన ఏర్పాట్లను దర్శకుడు అనిల్ రావిపూడి చకచకా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన నటీనటుల ఎంపిక ప్రక్రియను మొదలెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం ఆయన కన్నడ స్టార్ ఉపేంద్రను సంప్రదించాడట.

అయితే డేట్స్ లేని కారణంగా తాను ఈ సినిమాను చేయలేనని అన్నట్టుగా తాజా ఇంటర్వ్యూలో ఉపేంద్ర స్వయంగా చెప్పాడు. ఇక మరో కీలకమైన పాత్ర కోసం విజయశాంతి అయితే బాగుంటుందని భావించిన అనిల్ రావిపూడి ఆమెను సంప్రదించినట్టుగా సమాచారం. తన సినిమా ద్వారా విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వాలనే పట్టుదలతో ఆయన వున్నట్టుగా చెబుతున్నారు. అయితే విజయశాంతి ఏమన్నారనే విషయం ఇంకా బయటికి రాలేదు. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో బిజీగా ఉండటం వలన, ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Mahesh Babu
anil ravipudi
  • Loading...

More Telugu News