vangaveeti: వంగవీటి రాధాకు ముహూర్తం ఫిక్స్ అయింది!

  • రేపు టీడీపీలో చేరనున్న వంగవీటి
  • చంద్రబాబుతో గంటన్నర సేపు చర్చలు
  • వైసీపీని ఓడించడమే తన లక్ష్యమన్న రాధా

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రేపు ఆయన టీడీపీలో చేరనున్నారు. చంద్రబాబుతో దాదాపు గంటన్నర సేపు చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. భేటీ సందర్భంగా వైసీపీలో తనకు జరిగిన అవమానాలను చంద్రబాబు దృష్టికి వంగవీటి తీసుకొచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయడం తన లక్ష్యం కాదని... వైసీపీని ఓడించడమే తన ప్రధాన లక్ష్యమని రాధా చెప్పారు. మరోవైపు, ఎన్నికల్లో పోటీ చేసే నిర్ణయాన్ని రాధాకే చంద్రబాబు వదిలేశారు. 

vangaveeti
radhakrishna
Chandrababu
Telugudesam
join
  • Loading...

More Telugu News