Rajanna Sircilla District: అక్క కన్నా ముందు పెళ్లిని కోరుకున్న యువతి... కాదనడంతో ఆత్మహత్య!

  • రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ఘటన
  • పెద్ద అమ్మాయిలు ఉండగా పెళ్లి ఏంటన్న తల్లిదండ్రులు
  • కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న యువతి

తనకన్నా పెద్దదైన అక్క ఉండగానే, తనకు వివాహం చేయాలని కోరిన ఓ యువతి, తల్లిదండ్రులు మందలించారన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, గ్రామంలో నివాసం ఉండే చేప్యాల కనకయ్యకు రేణుక (20) మూడో కుమార్తె. రేణుక సిద్దిపేటలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతోంది.

తన కుమార్తెల వివాహం విషయమై ఇంట్లో చర్చ జరుగుతున్న వేళ, రేణుక తనకు పెళ్లి చేయాలని తల్లి దండ్రులను కోరింది. పెద్ద అమ్మాయిలు ఇంట్లో ఉండగా, నీ వివాహం ఎలా చేస్తామని తల్లిదండ్రులు రేణుకను మందలించారు. దీంతో ఆమె నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వారు వచ్చేసరికే రేణుక సజీవదహనమైంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

Rajanna Sircilla District
Marriage
Sucide
Sisters
  • Loading...

More Telugu News