Rajamouli: 14న రాజమౌళి మీడియా సమావేశం... ఆ రోజుతో వీడనున్న 'ఆర్ఆర్ఆర్' సస్పెన్స్!

  • 'ఆర్ఆర్ఆర్'పై కొనసాగుతున్న సస్పెన్స్
  • సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న పుకార్లు
  • కొంత సస్పెన్స్ ను తొలగించనున్న రాజమౌళి

బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్' (వర్కింగ్ టైటిల్)లో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ అని, ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని, బాక్సింగ్ నేపథ్యంలో సినిమా ఉంటుందని, రెండు జన్మల కథని... ఇలా ఎన్నో పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ కనిపిస్తారని, బాలీవుడ్ టాప్ హీరోయిన్లు నటిస్తారని కూడా టాక్. అయితే, సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచి రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన ఒక్క విషయాన్ని కూడా బయటకు రానీయలేదు.

వాస్తవానికి రాజమౌళి సినిమాను ప్రారంభించే రోజే ఆ సినిమాకు సంబంధించిన విశేషాలను రివీల్ చేస్తాడన్న సంగతి తెలిసిందే. ఈగ, బాహుబలి, మర్యాదరామన్న వంటి సినిమాల విషయంలో అదే జరిగింది. అయితే, ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి అయినా, 'ఆర్ఆర్ఆర్' గురించి మాత్రం ఏ వివరమూ వెల్లడి కాలేదు. ఇక ఈ సస్పెన్స్ కు తెరదించుతూ 14వ తేదీన రాజమౌళి మీడియా సమావేశం నిర్వహిస్తారని టాలీవుడ్ వర్గాల భోగట్టా. ఈ మీడియా సమావేశంలో సినిమాకు సంబంధించిన కొంత సస్పెన్స్ వీడిపోతుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ మీడియా సమావేశం విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

  • Loading...

More Telugu News