kalva srinivasulu: కాల్వ శ్రీనివాసులుకు రెబెల్స్ బెడద.. రంగంలోకి దిగిన జేసీ

  • రాయదుర్గం టికెట్ ను మళ్లీ కాల్వకే కేటాయించిన చంద్రబాబు
  • అభ్యంతరం వ్యక్తం చేసిన దీపక్ రెడ్డి, మెట్టు గోవింద్ రెడ్డి
  • కాల్వతో కలిసి దీపక్ రెడ్డిని బుజ్జగించిన జేసీ

ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అనంతపురం జిల్లా రాయదుర్గం శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా ఆయనకు అదే స్థానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కేటాయించారు. అయితే, ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, మెట్టు గోవింద్ రెడ్డిలు ధిక్కార స్వరం వినిపించారు. కాల్వకు టికెట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని హెచ్చరించారు. దీంతో, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. కాల్వ శ్రీనివాసులుతో కలసి దీపక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనను బుజ్జగించారు. అనంతరం మెట్టు గోవింద్ రెడ్డిని కూడా ఇరువురు నేతలు కలవనున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News