Nara Lokesh: నారా లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే సస్పెన్స్ వీడింది!

  • విశాఖ ఉత్తరం నుంచి బరిలోకి దిగనున్న లోకేష్
  • భీమిలి నుంచి పోటీ చేస్తారని తొలుత ప్రచారం
  • పెండింగ్ లో ఉన్న భీమిలి స్థానం

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థుల పేర్లు వెల్లడయ్యాయి. అయితే, ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై భారీ చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ సస్పెన్స్ వీడింది. విశాఖ ఉత్తరం నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారని టీడీపీ స్పష్టం చేసింది. విశాఖ జిల్లా భీమిలి నుంచి బరిలోకి దింపాలని తొలుత భావించినప్పటికీ... చివరకు విశాఖ ఉత్తరానికి ఆయన పేరును ఖరారు చేసింది. భీమిలి స్థానాన్ని టీడీపీ ఇంకా పెండింగ్ లో ఉంచింది. ఇక్కడి నుంచి మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ టీడీపీ తరపున పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

Nara Lokesh
visakha north
Telugudesam
contestant
  • Loading...

More Telugu News