Vangaveeti Radha: ఎంపీ సీటు గ్యారెంటీ... వంగవీటి రాధ డిమాండ్లకు ఓకే చెప్పిన చంద్రబాబు!

  • టీడీపీలో చేరికకు రంగం సిద్ధం
  • స్వయంగా ప్రకటించనున్న వంగవీటి
  • అనకాపల్లి లేదా నరసరావు పేట నుంచి ఎంపీగా చాన్స్

విజయవాడలో వైఎస్ఆర్ సీపీ మాజీ నేత వంగవీటి రాధాకృష్ణ, తెలుగుదేశం పార్టీలో చేరికకు రంగం సిద్ధమైపోయింది. వంగవీటి రాధకు అసెంబ్లీ సీటును కేటాయించలేమని, అనకాపల్లి లేదా నరసరావుపేట నియోజకవర్గాల్లో ఇష్టమొచ్చిన చోట నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో, పార్టీలో చేరేందుకు వంగవీటి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

అనకాపల్లి కన్నా, విజయవాడకు దగ్గరగా ఉండే నరసరావుపేట వైపే వంగవీటి మొగ్గు చూపుతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. రేపో, మాపో పార్టీలో చేరికపై ఆయనే స్వయంగా ప్రకటిస్తారని చెబుతున్నారు. ఎంపీగా పోటీ చేస్తే, ఆపై ఫలితం తారుమారైనా రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటామని, విజయవాడకు జరిగే మునిసిపల్ ఎన్నికల్లో రాధ అనుచరులకు ప్రాతినిధ్యం కల్పిస్తామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం.

Vangaveeti Radha
Chandrababu
Anakapalli
Narasarao pet
  • Loading...

More Telugu News