Sivaji Raja: మా ఊరికి వెళ్లిపోతున్నా: ఓడిపోయిన బాధలో శివాజీరాజా సంచలన వ్యాఖ్యలు!

  • నరేష్ చేతిలో ఓడిపోయిన శివాజీరాజా
  • నిబంధనలు పాటించని ప్రత్యర్థి ప్యానల్
  • ఇష్టం లేకుండానే మీడియా ముందుకు వచ్చా

మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో నటుడు సీనియర్ నరేష్ ప్యానల్ చేతిలో ఓడిపోయిన శివాజీరాజా, మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు జరిగే సమయంలో అసోసియేషన్ వ్యవహారాలపై ఎవరూ మీడియా ముందుకు వెళ్లి మాట్లాడరాదన్న నిబంధన ఉన్నా, ప్రత్యర్థి ప్యానల్ దాన్ని పాటించలేదని ఆరోపించారు. తాను, శ్రీకాంత్ అసోసియేషన్ లో ఎటువంటి అన్యాయాలు, అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు.

 ఎంతోమంది తనను తిరిగి నిలబడాలని కోరితేనే పోటీ చేశానని, తనను ఓడించారని, ఇక తన భార్యతో కలిసి ఊరికి వెళ్లిపోతానని అన్నారు. ఎవరైనా ఏడిస్తే తనకు ఇష్టం ఉండదని, కానీ, శ్రీకాంత్, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి వారు తన కోసం పడ్డ కష్టం చూసి కన్నీరు ఆగడం లేదని అన్నారు. తాను ఎవరినీ విమర్శించడం లేదని, ఇష్టం లేకుండానే మీడియా ముందుకు వచ్చానని అన్నారు. ప్రత్యర్థి ప్యానల్ ఎన్నో విమర్శలు చేశారని, వాటిని ఖండించకుంటే, అవే నిజమని భావిస్తారేమోనన్న భయంతోనే మీడియా సమావేశం పెట్టానని అన్నారు. తప్పు చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News