Makan.com: ఇంటి అద్దె రూ.16 వేలైనా ఓకేనట.. మెట్రో నగరాల్లో అద్దె ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్

  • రూ. 25 వేల వరకు పెట్టేందుకు కూడా రెడీ
  • 40 శాతం మంది ఉద్యోగులు మాత్రం రూ. 10 వేల లోపు అద్దెకే మొగ్గు
  • విద్యార్థులు కూడా రూ. 11 వేల వరకు అద్దెను చెల్లించేందుకు సిద్ధం

మెట్రో నగరాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్ ఎంతలా ఉందో చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. మకాన్ డాట్ కామ్ అనే వెబ్‌పోర్టల్ వెల్లడించిన వివరాలు విస్తుగొలుపుతున్నాయి. మెట్రో నగరాల్లో అద్దె ఇళ్లకు రోజురోజుకు విపరీతమైన గిరాకీ పెరుగుతోందని, నెల అద్దె రూ.16 వేలైనా చెల్లించేందుకు ఉద్యోగులు వెనకాడడం లేదని పేర్కొంది. విద్యార్థులు కూడా రూ.11 వేల వరకు చెల్లించేందుకు ముందుకొస్తున్నారని సంస్థ పేర్కొంది.

అద్దె ఇళ్ల కోసం వెతుకుతున్న వారిలో 69 శాతం మంది ఉద్యోగులు కాగా, 16 శాతం స్వయం ఉపాధిని వెతుక్కుంటూ నగరాలకు వచ్చిన వారని, అలాగే 15 శాతం మంది విద్యార్థులు ఉన్నట్టు వెల్లడించింది. 40 శాతం మంది ఉద్యోగులు పదివేల రూపాయల లోపు అద్దె ఉన్న ఇళ్ల కోసం వెతుకుతుండగా, మరో 40 శాతం మంది ఇల్లు దొరికితే చాలని, రూ.25 వేలైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని వెబ్‌పోర్టల్ తెలిపింది.

  • Loading...

More Telugu News