Ravi Deepika: చంద్రబాబు నుంచి పిలుపు... నర్సాపురం సీటు కోసం సౌదీ నుంచి వచ్చిన దంపతులు!

  • ఎంపీ స్థానానికి అనూహ్యంగా తెరపైకి రావి దీపిక
  • చంద్రబాబును కలిసి చర్చించిన దీపిక దంపతులు
  • కొత్తపల్లి సుబ్బారాయుడు తప్పుకోవడంతోనే

నర్సాపురం లోక్‌ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రావి దీపిక పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. సౌదీలో నివసిస్తున్న దీపిక దంపతులకు చంద్రబాబు నుంచి పిలుపు వెళ్లడంతో, వారు విదేశాల నుంచి వచ్చి, అమరావతిలో సీఎంను కలిసి చర్చించారు. మహిళ కావడం, కాపు సామాజికవర్గ సమీకరణలు రావి దీపికకు సానుకూలం అవుతాయని చంద్రబాబు భావించినట్టు తెలుస్తోంది.

వాస్తవానికి నర్సాపురం లోక్ సభకు తొలుత కొత్తపల్లి సుబ్బారాయుడి పేరును చంద్రబాబు ఖరారు చేయగా, ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తానని చెప్పడం, తోట సీతారామలక్ష్మికి అవకాశం ఇవ్వాలని భావించగా, ఆమె కూడా వెనుకంజ వేయడంతో రావి దీపిక పేరు తెరపైకి వచ్చింది. పట్టణానికే చెందిన దీపిక, రాధాకృష్ణ దంపతులు ఎన్నో ఏళ్లుగా సౌదీలో ఉంటున్నారు. సౌదీలో కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న రాధాకృష్ణ, తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి అభిమాని.

Ravi Deepika
Narsapuram
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News