Kurnool District: శ్రీశైలం ఆలయ పీఆర్వోపై కత్తులతో దాడి.. పరిస్థితి విషమం

  • ఇంటి నుంచి బయటకు వస్తున్న శ్రీనివాస్‌పై దాడి
  • నిందితుల్లో ఒకరు పోలీసుల అదుపులో
  • నిందితులు కర్నూలుకు చెందిన వారిగా గుర్తింపు

గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఆలయ పీఆర్వో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఇంటి నుంచి బయటకు వస్తున్న ఆయనపై కాపుకాసిన వ్యక్తులు కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన శ్రీనివాస్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. నిందితులు కర్నూలు వాసులుగా పోలీసులు గుర్తించారు. అయితే, దాడికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  

Kurnool District
Srisailam Temple
PRO
Murder Attack
Andhra Pradesh
  • Loading...

More Telugu News