Hyderabad: ఎన్నికల్లో పోటీ చేయాలి.. రుణమివ్వండి: బ్యాంకుకు సామాజిక కార్యకర్త దరఖాస్తు

  • కెనరా బ్యాంకును ఆశ్రయించిన వెంకటనారాయణ
  • అన్ని రంగాల వారికీ రుణాలిస్తున్న బ్యాంకులు తనకూ ఇవ్వాలని డిమాండ్
  • గత ఎన్నికల్లో డబ్బుల కోసం భిక్షాటన

త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్నానని కాబట్టి తనకు రుణం మంజూరు చేయాలంటూ ఓ సామాజిక కార్యకర్త బ్యాంకును ఆశ్రయించాడు. హైదరాబాద్‌లో జరిగిందీ ఘటన. అంబర్‌పేటకు చెందిన సామాజిక కార్యకర్త కె.వెంకటనారాయణ రానున్న ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవకు అంకితం కావాలని ఉందని పేర్కొన్న వెంకట నారాయణ.. పోటీకి చాలా డబ్బులు ఖర్చవుతాయని, కాబట్టి రుణం ఇవ్వాలంటూ సోమవారం నల్లకుంటలోని కెనరా బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నారు.  

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని రంగాల వారికీ రుణాలు ఇస్తున్న బ్యాంకులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా రుణాలు ఇవ్వాలన్నారు. అంతేకాదు, ఇందుకోసం ప్రత్యేకంగా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల కమిషన్, రాష్ట్రపతి, గవర్నర్‌లకు గతంలోనే ఈ డిమాండ్‌తో లేఖలు రాసినట్టు వెంకటనారాయణ తెలిపారు. గత ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి బరిలోకి దిగిన ఆయన డబ్బుల్లేక భిక్షాటన చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

Hyderabad
Nallkunta
Telangana
Canra Bank
Social worker
Election Loan
  • Loading...

More Telugu News