Sadineni Yamini: ఐదేళ్లయినా మకాం మార్చడం చేతకాని జగన్: సాధినేని యామిని ఎద్దేవా

  • జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదం
  • డ్రామాలాడటంలో జగన్‌ను మించిన వారు లేరు
  • జగన్‌ను ఏపీ ప్రజలు నమ్మరు

ఏప్రిల్ 11న ఓటు వేసి.. మరుసటి రోజే కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి వైసీపీ అధినేత జగన్‌దని.. అలాంటి వ్యక్తి అవినీతిపై నీతి గెలుస్తుందంటూ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని ఎద్దేవా చేశారు. జగన్ నేడు కాకినాడలో నిర్వహించిన సమర శంఖారావ సభలో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో యామిని మాట్లాడుతూ.. డేటా చౌర్యం, ఫారం - 7, కోడికత్తి వంటి డ్రామాలాడటంలో జగన్‌ను మించిన వారు లేరన్నారు. ఐదు కోట్ల మంది కలల సౌధమైన రాజధాని నగరం అమరావతిని.. భ్రమరావతి అంటూ హేళన చేయడం తప్ప ఐదేళ్లయినా ఏపీకి మకాం మార్చడం చేతకాని జగన్ అంటూ విరుచుకుపడ్డారు. అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరిగే జగన్‌ను ఏపీ ప్రజలు నమ్మరని యామిని విమర్శించారు.

Sadineni Yamini
Telugudesam
Jagan
Chandrababu
Guntur
Amaravathi
  • Loading...

More Telugu News