Kodali Nani: కొడాలి నానిపై పోటీకి దేవినేని అవినాశ్ ను ఖరారు చేసిన చంద్రబాబు

  • నానిని ఎదుర్కోవాలంటే బలమైన అభ్యర్థి కావాలి
  • రావి వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్సీ 
  • యలవర్తి శ్రీనివాస్‌కు కార్పొరేషన్ పదవి హామీ

ఎన్నికలకు నెల మాత్రమే సమయం ఉండటంతో  పార్టీలన్నీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీబిజీగా ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ల ఖరారు అంశాన్ని దాదాపు పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. పెండింగ్‌లో ఉంచిన నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుడివాడ నియోజకవర్గ అభ్యర్థిని చంద్రబాబు ఖరారు చేశారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని మళ్లీ బరిలోకి దిగుతున్నారు.

నానిని ఎదుర్కోవాలంటే బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలనే ఉద్దేశంతో ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే ఆ స్థానాన్ని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాశ్‌కు కేటాయించారు. ఈ నేపథ్యంలో గుడివాడ నుంచి గతంలో పోటీ చేసిన నేతల్లో అసంతృప్తి తలెత్తకుండా చంద్రబాబు వ్యవహరించారు. గతంలో అక్కడి నుంచి పోటీ చేసిన సీనియర్ నేత రావి వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్సీ, మరో నేత యలవర్తి శ్రీనివాస్‌కు కార్పొరేషన్ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.


Kodali Nani
Devineni Avinash
Devineni Nehru
Chandrababu
Raavi Venkateswara Rao
Yalavarthi Srinivas
  • Loading...

More Telugu News