Kumara Mangalam Birla: నేనూ మనిషినే.. మా కష్టార్జితంతోనే ఈ స్థాయికి వచ్చాం: అనన్య బిర్లా

  • మిలియనీర్ కూతుర్ని అయితే ఏంటి?
  • ఈ విషయాన్ని ఇతరులతో పంచుకోవాలి
  • మా నాన్న మిలియనీర్ కాదు.. బిలియనీర్

ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా ముద్దుల తనయ అనన్య బిర్లాను కొందరు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. ఆమె ‘మిలియనీర్ కిడ్’ అని ఓ నెటిజన్ కామెంట్  చేశారు. దీనిపై అనన్య కాస్త ఘాటుగా స్పందించారు. తాను ఎవరి కూతుర్నైనప్పటికీ, తానూ ఒక మనిషినేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటూ ఘాటుగా సమాధానమిచ్చారు.

‘‘నేను మిలియనీర్ కూతుర్ని అయితే ఏంటి? నేనూ మనిషినే. మా కష్టార్జితంతోనే మేం ఈ స్థాయికి చేరుకున్నాం. ఈ విషయాన్ని కచ్చితంగా ఇతరులతో పంచుకోవాలి. ఇంకో విషయం.. మీరన్నట్టు మా నాన్న మిలియనీర్ కాదు.. బిలియనీర్’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News