Jagan: మరికొద్ది రోజుల్లో లగడపాటి దొంగ సర్వే కూడా వస్తుంది: జగన్

  • పోలీసులు చంద్రబాబుకి వాచ్‌మెన్లుగా మారారు
  • తెలంగాణలో లగడపాడి సర్వే ఏమైందో తెలుసు
  • చంద్రబాబు సైబర్ క్రైంకు పాల్పడ్డారు

ఇంటెలిజెన్స్ పోలీసులు చంద్రబాబు వాచ్‌మెన్లుగా మారారని.. వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. నేడు ఆయన కాకినాడ ఎన్నికల సమర శంఖారావం సభలో మాట్లాడుతూ.. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేపై స్పందించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందని.. ఇక మరికొద్ది రోజుల్లో లగడపాటి దొంగ సర్వే కూడా వస్తుందని ఎద్దేవా చేశారు.

తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి సర్వే ఏమైందో అందరికీ తెలుసని జగన్ గుర్తు చేశారు. ఆర్థికంగా, సామాజికంగా అందరినీ పైకి తీసుకొస్తానన్నారు. చంద్రబాబు సైబర్ క్రైంకు పాల్పడ్డారని. తమ ఆధార్, ఇతర వివరాలను ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడానికి ఆయన ఎవడో చర్చించాలన్నారు. చంద్రబాబు రేపో మాపో పెద్ద పెద్ద నేరాలకు కూడా పాల్పడి జైలు మెట్లెక్కుతారన్నారు. టీడీపీ ప్రజల డేటా చోరీకి పాల్పడి అడ్డంగా దొరికిపోయిందని.. దానిని బహిష్కరించాలని అన్నారు.

Jagan
Chandrababu
Lagadapati Rajagopal
Telangana
Intelligence Police
Kakinada
  • Loading...

More Telugu News