Mallu Bhatti Vikramarka: స్పీకర్ నుంచి స్పందన రాకుంటే హైకోర్టును ఆశ్రయిస్తాం: భట్టి

  • స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చాం
  • ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
  • కేసీఆర్ కోరిక అదేనన్న భట్టి 

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చామని, ఆయన నుంచి స్పందన రాకుంటే మాత్రం హైకోర్టును ఆశ్రయిస్తామని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ స్పీకర్ చరిత్రలోనే హైకోర్టు నుంచి నోటీసులు అందుకున్న దాఖలాలు ఇప్పటి వరకూ లేవన్నారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షం లేకుంటే ప్రజాస్వామ్యం ఉండదని, కేసీఆర్ కోరిక కూడా అదేనని అన్నారు. ఈ విషయమై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని ఆశిస్తున్నానని భట్టి తెలిపారు.

Mallu Bhatti Vikramarka
Assembly Speaker
KCR
High Court
Telangana
  • Loading...

More Telugu News