raana: అలా చరణ్ తో నాకు స్నేహం ఏర్పడింది: రానా

  • చదువుపై ఆసక్తి ఉండేది కాదు 
  • సినిమాలపైనే దృష్టి ఉండేది 
  • మా తాతయ్య అది గమనించారు  

ప్రస్తుతం రానా వరుస సినిమా షూటింగులతో బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. "చిన్నప్పటి నుంచి కూడా నాకు చదువుపై పెద్దగా ఆసక్తి వుండేది కాదు. సినిమా వాతావరణంలో పెరగడం వలన .. సినిమాలపైనే ఇష్టం పెరిగింది. మా తాతయ్య రామానాయుడు కూడా సినిమాలపట్ల నాకు గల ఆసక్తిని గమనించేవారు.

చదువుపై దృష్టి లేకపోవడం వలన, టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాను. దాంతో మా వాళ్లు నన్ను వేరే స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడ నాకు చరణ్ తారసపడ్డాడు. తాను కూడా టెన్త్ ఫెయిల్ అయిన కారణంగా ఆ స్కూల్ కి వచ్చాడు. మా ఇద్దరి మధ్య మంచి స్నేహభావం అక్కడే ఏర్పడింది. 'బాహుబలి' నుంచి ప్రభాస్ కూడా నాకు మంచి స్నేహితుడయ్యాడు. అప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్, 'బాహుబలి' కోసం అన్ని సంవత్సరాలు కేటాయించడం నిజంగా ఆయన గొప్పతనం" అని చెప్పుకొచ్చాడు.

raana
charan
  • Loading...

More Telugu News