Krishna District: కృష్ణా జిల్లా రాజకీయాల్లో ట్విస్ట్.. వంగవీటి రాధాతో కొడాలి నాని భేటీ

  • ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి
  • గుడివాడలో అధిక సంఖ్యలో కాపు ఓటర్లు
  • చర్చనీయాంశంగా మారిన ఇద్దరి భేటీ

సరిగ్గా నెల రోజుల్లో (ఏప్రిల్ 11) ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో, ఎన్నికల్లో విజయకేతం ఎగురవేసేందుకు వివిధ పార్టీల నేతలు వ్యూహాలు, ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో తాజాగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును వంగవీటి రాధా కలవబోతున్నారనే తరుణంలో... వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. గుడివాడ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గానికి చెందిన ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీంతో, వీటి భేటీ చర్చనీయాంశంగా మారింది.

Krishna District
vangaveeti radha
kodali nani
gudivada
ysrcp
Telugudesam
meeting
  • Loading...

More Telugu News