Chandrababu: చంద్రబాబును కలిసేందుకు సిద్ధమైన అలీని కేసీఆర్ బెదిరించారు: బుద్ధా వెంకన్న

  • ఈ ఉదయం 11 గంటలకు చంద్రబాబు వద్దకు వస్తానని అలీ చెప్పారు
  • కేసీఆర్ బెదిరింపులతో వైసీపీలో చేరారు
  • దేవినేని ఉమా సోదరుడు వైసీపీలో ఎప్పుడో చేరారు

వైసీపీ తీర్థం పుచ్చుకున్న సినీ హాస్య నటుడు అలీపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వస్తానని తనతో అలీ చెప్పారని... కానీ, కేసీఆర్ బెదిరింపులతో జగన్ వద్దకు వెళ్లి, వైసీపీలో చేరారని విమర్శించారు. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలని అలీ కోరుకున్నారని గుర్తు చేశారు.

వైసీపీని కేసీపీగా జగన్ మార్చి వేశారని బుద్ధా వెంకన్న అన్నారు. తొలి విడతలోనే ఏపీలో ఎన్నికలు జరగనుండటానికి ప్రధాని మోదీ, కేసీఆర్ ల ఒత్తిడే కారణమని దుయ్యబట్టారు. ఎన్ని కుట్రలకు పాల్పడినా ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి టీడీపీకి ఉన్న ఆయుధం ప్రజలేనని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి చరిత్ర చంద్రబాబుదైతే... అవినీతి చరిత్ర జగన్ దని చెప్పారు. దేవినేని ఉమా సోదరుడు ఈ రోజు కొత్తగా వైసీపీలో చేరలేదని... ఎప్పుడో చేరారని అన్నారు. వైసీపీలో చేరినా ఇన్నాళ్లు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని... ఇప్పుడేదో మళ్లీ వైసీపీలో చేరినట్టు హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. సొంత మనుషులు పార్టీ మారినా తను కానీ, దేవినేని ఉమా కానీ పట్టించుకోవడం లేదని చెప్పారు. 

Chandrababu
devineni uma
budda venkanna
kcr
Telugudesam
ysrcp
jagan
TRS
chandrababu
ali
  • Loading...

More Telugu News