pawan kalyan: ముఖ్య నేతలతో అత్యవసరంగా భేటీ అయిన పవన్ కల్యాణ్

  • ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై భేటీ
  • వామపక్షాలకు కేటాయించాల్సిన స్థానాలపై చర్చ
  • పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లను పవన్ కు వివరించిన నేతలు

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. పార్టీ ముఖ్యనేతలను పిలిపించుకుని, వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీతో చర్చలు జరిపారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమంటూ వచ్చిన 1200 మంది ఆశావహుల బలాబలాలపై చర్చించారు. దీనికితోడు మిత్రపక్షాలైన వామపక్షాలకు కేటాయించాల్సిన స్థానాలపై కూడా చర్చలు జరిపారు. మరోవైపు, ఈనెల 14న రాజమండ్రిలో నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై పవన్ కు పార్టీ నేతలు వివరించారు. 

pawan kalyan
janasena
candidates
  • Loading...

More Telugu News