manmohan singh: ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇష్టపడని మన్మోహన్ సింగ్

  • అమృత్ సర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరుతున్న నేతలు
  • సున్నితంగా తిరస్కరించిన మన్మోహన్
  • 2014లో ఇక్కడి నుంచి అమరీందర్ సింగ్ చేతిలో ఓడిపోయిన జైట్లీ

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విముఖంగా ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పంజాబ్ లోని అమృత్ సర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమర్ సింగ్ తో పాటు, కాంగ్రెస్ సీనియర్లు అభ్యర్థించినప్పటికీ... ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం.

రెండు సార్లు ప్రధానిగా పని చేసిన మన్మోహన్... ఆ రెండు సార్లు రాజ్యసభ నుంచే ప్రాతినిథ్యం వహించారు. 2009లో అమృత్ సర్ నుంచి పోటీ చేసే అవకాశం వచ్చినప్పటికీ... అనారోగ్య కారణాలతో పోటీ చేయలేదు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ... కెప్టెన్ అమరీందర్ సింగ్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2017లో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నికవడంతో... ఆ స్థానాన్ని ఖాళీ చేశారు.

manmohan singh
amarinder singh
arun jaitly
congress
bjp
  • Loading...

More Telugu News