Sunny Leone: గతం గురించి ప్రశ్నిస్తే.. కంటతడి పెట్టిన సన్నీలియోన్

  • అర్భాజ్ ఖాన్ 'పింక్' షోకు హాజరైన సన్నీ
  • గత జీవితం గురించి ఓ నెటిజన్ కామెంట్ ప్రస్తావన
  • పాత విషయాలను అడుగుతూ మానసిక వేదనకు గురి చేస్తున్నారంటూ ఆవేదన

పోర్న్ స్టార్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సన్నీలియోన్... పాత జీవితానికి ముగింపు పలికి, బాలీవుడ్ తో పాటు మన దేశంలోని పలు భాషల సినిమాల్లో నటిస్తోంది. పోర్న్ స్టార్ గుర్తింపును చెరిపేసుకుని బాలీవుడ్ స్టార్ గా ఎదిగింది. అయినప్పటికీ గత జీవితపు మరకలు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి.

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ నిర్వహిస్తున్న 'పింక్' టాక్ షోకు సన్నీ హాజరైంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై నెటిజన్ల కామెంట్లు, వారి ప్రశ్నలపై ఈ షోలో చర్చిస్తుంటారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ చేసిన అసభ్యకర కామెంట్ గురించి అర్భాజ్ ప్రస్తావించగా... సన్నీ కంటతడి పెట్టుకుంది. భోరున విలపించింది. అర్భాజ్ ఓదార్చుతున్నా ఆమె కుదుటపడలేదు. పాత జీవితాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని గడుపుతున్న సమయంలో కూడా... పాత విషయాలనే అడుగుతూ తనను మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Sunny Leone
pink
show
arbhaz khan
bollywood
  • Loading...

More Telugu News