mumbai: ప్రాణం తీసిన హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌...ఆపరేషన్‌ వికటించి పేషెంట్‌ మృతి

  • హఠాత్తుగా చుట్టుముట్టిన ఎలర్జీ
  • శ్వాస తీసుకోవడం కష్టం కావడంతో మృతి
  • ముంబయిలో ఘటన

జుట్టుతో అందంగా కనిపించాలన్న అతని ప్రయత్నం మొదటికే మోసం తెచ్చింది. హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్‌ వికటించి మృత్యు ఒడిలోకి నెట్టింది. ఈ విషాదకర ఘటన ముంబయిలో చోటు చేసుకుంది. సాకినాక ప్రాంతానికి చెందిన శ్రావణ్‌కుమార్‌ చౌదరి (43)కి హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్లో భాగంగా తలపై 9,500 వెంట్రుకలను ట్రాన్స్‌ప్లాంట్ చేశారు.

అయితే, ఈ సర్జరీ చేసిన 15 గంటల తర్వాత శ్రావణ్‌ తీవ్ర ఎలర్జీ బారిన పడ్డాడు. ముఖం, గొంతు వాచిపోయాయి. శ్వాస తీసుకోవడం కూడా కష్టం కావడంతో కుటుంబ సభ్యులు అతన్ని పొవాయ్‌ హీరానందిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగానే చనిపోయాడు. అలర్జీ వల్లే శ్రావణ్‌ చనిపోయాడని వైద్యులు తెలియజేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

mumbai
hair trnsplantation
one died
  • Loading...

More Telugu News