actress: నలుగురు మగవాళ్లని ఓడించి గెలిచాను: సినీ నటి హేమ

  • 'మా' ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా విజయం సాధించిన హేమ
  • ఇండిపెండెంట్ గా పోటీ చేసి.. జయకేతనం
  • విజయాన్ని ఇండస్ట్రీలోని మహిళలకు అంకితం చేసిన హేమ

నిన్న జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పాలకవర్గ ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో 'మా' ఉపాధ్యక్షురాలిగా హేమ గెలుపొందింది. ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఆమె విజయం సాధించింది. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, విజయం సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది. నలుగురు మగవాళ్లను ఓడించి తాను ఈ ఎన్నికల్లో గెలుపొందానని తెలిపింది. ఈ విజయాన్ని సినీ పరిశ్రమలోని మహిళలకు అంకితం చేస్తున్నానని... వారి మద్దతు లేకుండా తాను ఈ విజయాన్ని సాధించలేనని చెప్పింది. ఏవైతే హామీలను ఇచ్చానో... వాటిని నెరవేర్చేందుకు కృషి చేస్తానని తెలిపింది. 

  • Loading...

More Telugu News