devineni uma: మా అన్న నియోజకవర్గంలో వైసీపీని భారీ మెజార్టీతో గెలిపిస్తాం: దేవినేని ఉమ సోదరుడు చంద్రశేఖర్

  • జగన్ ను కలిసిన దేవినేని ఉమా సోదరుడు చంద్రశేఖర్
  • విజయవాడ బహిరంగసభలో వైసీపీలో చేరిక
  • టీడీపీలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందంటూ వ్యాఖ్య

ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ వైసీపీలో చేరనున్నారు. ఈ ఉదయం హైదరాబాదులోని లోటస్ పాండ్ లో ఆ పార్టీ అధినేత జగన్ తో ఆయన భేటీ అయ్యారు. విజయవాడలో జరగనున్న వైసీపీ భారీ బహిరంగసభలో చంద్రశేఖర్ ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో చంద్రశేఖర్ మాట్లాడుతూ, టీడీపీలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. మైలవరం నియోజవర్గంలో వైసీపీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చంద్రశేఖర్ తెలిపారు. ఇరిగేషన్ మంత్రిగా దేవినేని ఉమ ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు మైలవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా దేవినేని ఉమ పోటీ చేస్తారని ఇప్పటికే ఆ పార్టీ అధిష్ఠానం ఫిక్స్ చేసింది. ఈ నేపథ్యంలో, ఉమ సోదరుడు చంద్రశేఖర్ వైసీపీలో చేరుతుండడం ఆసక్తికరంగా మారింది. 

devineni uma
devineni chandrasekhar
Telugudesam
ysrcp
mylavaram
  • Loading...

More Telugu News