Krishna District: మంత్రి దేవినేని ఉమకు షాక్‌...జగన్‌తో భేటీ అయిన ఆయన సోదరుడు చంద్రశేఖర్‌

  • లోటస్‌ పాండ్‌లో అడుగు పెట్టిన యువనేత
  • వెంటబెట్టుకు వెళ్లిన వసంత కృష్ణప్రసాద్‌
  • వైసీపీ అధినేతతో భేటీ అయి కాసేపు మంతనాలు

కృష్ణా జిల్లాలో టీడీపీ కీలకనేత, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్‌ అన్నకు గట్టి షాక్ ఇచ్చారు. ఈరోజు ఉదయం వైసీపీ అధినేత జగన్‌ను హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో కలిశారు. వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్‌, చంద్రశేఖర్‌ను వెంటేసుకుని లోటస్‌పాండ్‌కు వెళ్లారు. ఉదయం సినీ హాస్యనటుడు అలీకి పార్టీ కండువా కప్పిన అనంతరం జగన్‌ చంద్రశేఖర్‌తో చాలాసేపు మాట్లాడినట్లు సమాచారం.

ఈ నెల 14వ తేదీన విజయవాడలో వైసీపీ సమరశంఖారావం సభ జరగనున్న విషయం తెలిసిందే. ఆ రోజు సభలో అధికారికంగా చంద్రశేఖర్‌ వైసీపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఆయన జగన్‌ను కలిసినట్లు తెలుస్తోంది.

Krishna District
devineni uma
devineni chandrshekar
YSRCP
  • Loading...

More Telugu News