lamb: 'కేజీఎఫ్' హీరో యశ్‌ను చంపేందుకు కుట్రలంటూ వార్తలు హల్‌చల్

  • యశ్‌కు ప్రాణహాని ఉందంటూ మీడియాలో వార్తలు
  • ఈ వార్తలు ఎవరు పుట్టిస్తున్నారో తెలియదన్న యశ్
  • ఎవడు పడితే వాడొచ్చి నరకడానికి తాను గొర్రెను కాదన్న నటుడు

కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, కేజీఎఫ్ హీరో యశ్‌కు ప్రాణహాని ఉందని, ఆయన హత్యకు కుట్ర జరుగుతోందంటూ మీడియాలో వస్తున్న వార్తలపై యశ్ స్పందించాడు. తనను ఎవరూ చంపాలనుకోవడం లేదని, ఈ విషయమై బెంగళూరు ఏసీపీతో ఇప్పటికే మాట్లాడానని పేర్కొన్నాడు. తనపై ఎటువంటి కుట్రలు జరగడం లేదన్నారు.

మీడియాలో వస్తున్న వార్తలతో తన కుటుంబ సభ్యులు, అభిమానులు కలత చెందుతున్నారని, వదంతులతో తన కుటుంబం భయపడుతోందని యశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. వార్తల కారణంగా తనకు ఆగకుండా ఫోన్లు వస్తున్నాయని పేర్కొన్నాడు. ఎవరైనా ఓ గ్యాంగ్‌స్టర్ అరెస్ట్ అయితే తన ప్రాణాలకు ముప్పు ఉందని వార్తలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. మున్ముందు వీటి వల్ల ఎటువంటి ఘటనలు జరుగుతాయోనని భయంగా ఉందన్నాడు. అసలు తనకు ప్రాణహాని ఉందన్న వార్తలను మీడియాకు ఎవరు చేరవేస్తున్నారో తనకు తెలియడం లేదన్నారు. ఎవడు పడితే వాడొచ్చి నరికేయడానికి తాను గొర్రెను కానని యశ్ తేల్చి చెప్పాడు.  

lamb
actor Yash
KGF
threat
Kannada
Sandalwood
  • Loading...

More Telugu News