lok sabha: ఏ రాష్ట్రాలకు ఎన్ని దశల్లో ఎన్నిక? ఏపీ, తెలంగాణలకు ఒకే ఫేజ్ లో ఎలక్షన్
- 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే విడత ఎన్నికలు
- బీహార్, యూపీ, పశ్చిమబెంగాల్ లకు ఏడు దశల్లో పోలింగ్
- జమ్ముకశ్మీర్ కు ఐదు దశల్లో పోలింగ్
సార్వత్రిక ఎన్నికలను నగారా మోగింది. చీఫ్ ఎలక్షన్ కమిషర్ సునీల్ అరోరా షెడ్యూల్ వివరాలను ప్రకటించారు. మొత్తం ఏడు దశల్లో జరుగుతున్న ఎన్నికలు... ఏ రాష్ట్రంలో ఎన్ని దశల్లో జరగునున్నాయో చూద్దాం.
సింగిల్ ఫేజ్ లో ఎన్నికలు పూర్తయ్యే రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాఖండ్, అండమాన్ నికోబార్, దాద్రా మరియు నగర్ హవేలీ, డమన్ మరియు డయూ, లక్షద్వీప్, ఢిల్లీ, పుదుచ్చేరి, చండీగఢ్.
రెండు దశల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు: కర్ణాటక, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర.
మూడు దశల్లో ఎన్నికలు జరిగా రాష్ట్రాలు: అసోం, ఛత్తీగఢ్.
నాలుగు దశల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు: జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా.
ఐదు దశల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రం: జమ్ముకశ్మీర్.
ఏడు దశల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు: బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్.