Andhra Pradesh: వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తానన్న వార్తలు అవాస్తవం: లగడపాటి రాజగోపాల్

  • నర్సరావుపేట నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానన్న వార్తలు అవాస్తవం
  • రాజకీయాలకు తాను వ్యతిరేకం కాదు
  • కానీ, పోటీ చేయకూడదన్న నిర్ణయం తీసుకున్నా

వచ్చే ఎన్నికల్లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పోటీ చేస్తారంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా గుంటూరు జిల్లా నర్సరావుపేట నుంచి తాను పోటీ చేస్తానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. నర్సరావుపేట సహా ఏ నియోజకవర్గంపైనా తాను చర్చలు జరపలేదని, ఎన్నికల్లో పోటీ చేసే విషయమై తాను ఎవరితోనూ చర్చించలేదని చెప్పారు. రాజకీయాలకు తాను వ్యతిరేకం కాదని, అయితే, పోటీ చేయకూడదన్న నిర్ణయం మాత్రం తీసుకున్నట్టు చెప్పారు. అయితే, తనను పోటీ చేయమంటూ తన అనుచరులు, సహచరుల నుంచి ఒత్తిడి వస్తున్నట్టు లగడపాటి చెప్పడం గమనార్హం.  

Andhra Pradesh
ex mp
lagadapati
Telugudesam
elections
  • Loading...

More Telugu News