lok sabha: మోగిన ఎన్నికల నగారా.. ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన ఈసీ
- 7 దశల్లో లోక్ సభ ఎన్నికలు
- ఏప్రిల్ 11న పోలింగ్ ప్రారంభం. మే 23న కౌంటింగ్.
- నేటి నుంచో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. జూన్ 3న ప్రస్తుత లోక్ సభ ముగియన్న తరుణంలో, మే నెలలో ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ ను ప్రకటించింది. ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా షెడ్యూల్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతూ ఎన్నిక షెడ్యూల్ వివరాలను ప్రకటించారు.
9 దశల్లో కాకుండా 7 దశల్లో ఎన్నికలు జరుగుతాయి.
తొలి దశ: పోలింగ్ ఏప్రిల్ 11న.
రెండో దశ: ఏప్రిల్ 18న పోలింగ్.
మూడో దశ: పోలింగ్ తేదీ ఏప్రిల్ 23.
నాలుగో దశ: పోలింగ్ తేదీ ఏప్రిల్ 29.
ఐదో దశ: పోలింగ్ తేదీ మే 6
ఆరో దశ: పోలింగ్ తేదీ మే 12.
ఏడో దశ: పోలింగ్ తేదీ మే 19.
కౌంటింగ్ తేదీ మే 23. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది.