chiranjeevi: టీవీ యాంకర్ కు సారీ చెప్పిన చిరంజీవి.. వీడియో చూడండి

  • మా ఎన్నికల్లో ఓటు వేసిన చిరంజీవి
  • బయటకు వస్తుండగా మాట్లాడేందుకు యత్నించిన టీవీ యాంకర్
  • భద్రతాసిబ్బంది అడ్డుకోవడంతో .. యాంకర్ కు సారీ చెప్పిన వైనం

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో నాగార్జునతో కలసి చిరంజీవి ఫిలిం ఛాంబర్ కు వెళ్లారు. ఓటు వేసిన అనంతరం ఇద్దరూ కలసి కారు వద్దకు బయల్దేరారు. ఈ సందర్భంగా వీరిని చూడ్డానికి అభిమానులు ఎగబడ్డారు. పక్కనున్న భద్రతా సిబ్బంది వారికి లైన్ క్లియర్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇంతలో చిరంజీవితో బైట్ తీసుకునేందుకు ఓ టీవీ చానల్ కు చెందిన యాంకర్ ఆయన ముందు మైక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే, భద్రతా సిబ్బంది ఆమెను చిరు వద్దకు రాకుండా అడ్డుకున్నారు. దాన్ని గమనించిన చిరంజీవి వారిని ఉద్దేశిస్తూ... 'ఏయ్ ఆగండి' అంటూ ముందుకు వచ్చారు. ఆప్యాయతతో ఆమె బుగ్గను తాకి... 'సారీ అమ్మా' అని అన్నారు. దీన్ని చూసిన అక్కడున్న వారంతా చిరంజీవి మంచితనానికి ఫిదా అయిపోయారు. అనంతరం చిరు, నాగ్ లు ఒకే వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

chiranjeevi
nagarjuna
maa
elections
girl
sorry
  • Error fetching data: Network response was not ok

More Telugu News