election commission: రాహు కాలంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల.. దక్షిణాది నేతల్లో టెన్షన్

  • సాయంత్రం 5 గంటలకు ఎన్నికల షెడ్యూల్
  • 4.30 నుంచి 6 గంటల వరకు రాహుకాలం
  • కేసీఆర్, చంద్రబాబు, దేవెగౌడ, యడ్యూరప్పలకు పంచాంగంపై ఎనలేని నమ్మకం

లోక్ సభతో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూలును సాయంత్రం 5 గంటలకు ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల అవుతుందా? లేదా? అనే విషయంలో మాత్రం సందిగ్ధత నెలకొంది.

మరోవైపు, షెడ్యూల్ విడుదలవుతున్న సమయం గురించి దక్షిణాది నేతలు టెన్షన్ పడుతున్నారు. సాయంత్రం 4.30 గంటల నుంచి 6 వరకు రాహు కాలం ఉండటమే దీనికి కారణం. మన దక్షిణాది నేతలు వాస్తు, జ్యోతిష్యం, పంచాగాన్ని ఎంతో నమ్మకంగా పాటిస్తారనే సంగతి తెలిసిందే.

శాసనసభను రద్దు చేయడానికి, ఎన్నికల ప్రచారానికి, రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారానికి, మంత్రి మండలి విస్తరణకు ఇలా అన్ని అంశాల్లో కేసీఆర్ గ్రహబలాల ఆధారంగానే ముందడుగు వేశారు. దేవెగౌడ, చంద్రబాబు నాయుడు, యడ్యూరప్పలకు కూడా వీటిపై నమ్మకం చాలా ఎక్కువే. ఈ నేపథ్యంలో, రాహు కాలంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుండటం పట్ల నేతలు కలవరపాటుకు గురవుతున్నారు.

election commission
election schedule
rahu kaal
  • Loading...

More Telugu News