Andhra Pradesh: విజయసాయిరెడ్డి చాలా అక్రమాలకు పాల్పడ్డారు.. ఆయన్ను అరెస్ట్ చేసే ధైర్యం తెలంగాణ పోలీసులకు ఉందా?: నక్కా ఆనంద్ బాబు

  • డేటా చోరీలో జగన్ అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు
  • తెలంగాణ ప్రభుత్వంతో కలిసి టీడీపీపై కుట్రలు చేస్తున్నారు
  • గుంటూరులో మీడియాతో ఏపీ మంత్రి

డేటా చోరీ విషయంలో జగన్ అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారనీ, ఆయన్ను అరెస్ట్ చేసే ధైర్యం తెలంగాణ పోలీసులకు ఉందా? అని ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలోని వసంతరాయపురంలో ఈరోజు మీడియాతో మంత్రి మాట్లాడారు.

ఏపీలో బలంగా ఉన్న టీడీపీని ఎదుర్కోలేక జగన్ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి కుట్రలు చేస్తున్నారని మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు. ఆయనకు విజ్ఞత ఉన్న ఏపీ ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

Andhra Pradesh
Telugudesam
nakka
anandbabu
Jagan
YSRCP
Telangana
Vijay Sai Reddy
  • Loading...

More Telugu News