Andhra Pradesh: టీడీపీలోకి వలసల నేపథ్యంలో.. అనుచరులతో ఎస్పీవై రెడ్డి భేటీ

  • తెలుగుదేశం పార్టీలోకి జోరుగా వలసలు
  • పార్టీ అధిష్టానం మనకే అనుకూలంగా ఉందన్న ఎస్పీవై రెడ్డి
  • పార్టీ మారడం లేదన్న శ్రీధర్ రెడ్డి

కర్నూలు జిల్లా రాజకీయం రసవత్తరంగా మారుతోంది. టీడీపీలోకి రాజకీయ వలసలు జోరందుకుంటున్న నేపథ్యంలో ఎస్పీవై రెడ్డి ఈరోజు తన మద్దతుదారులు, టీడీపీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అధిష్ఠానం మనపై పూర్తి విశ్వాసం కనబరుస్తోందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ మనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇప్పటివరకూ నిర్వహించిన సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాము పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. ఎస్పీవై రెడ్డి ఆరోగ్యంపై, టికెట్ కేటాయింపులపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని కార్యకర్తలకు సూచించారు. ఎస్పీవై రెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Andhra Pradesh
Telugudesam
YSRCP
spy reddy
Chandrababu
Kurnool District
  • Loading...

More Telugu News