Andhra Pradesh: చంద్రబాబుకు 2 ఎంపీ సీట్లు కూడా రావని తెలిసింది.. అందుకే ప్రాంతీయ పార్టీల నేతలు లైట్ తీసుకుంటున్నారు!: విజయసాయిరెడ్డి

  • ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో మమతకు బాబు ఫోన్ చేశారు
  • వారం రోజులుగా ప్రయత్నిస్తున్నా ఆమె మాట్లాడలేదు
  • ట్విట్టర్ లో చంద్రబాబుపై వైసీపీ నేత సెటైర్లు 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో చంద్రబాబుకు రెండు సీట్లకు మించి రావని తెలుసుకున్న ప్రాంతీయ పార్టీల నేతలు ఆయన్ను లైట్ తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అందుకే ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో మద్దతు కోరేందుకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి వారం రోజులుగా ఫోన్ చేస్తున్నా, అసలు మాట్లాడటానికే ఆమె ఇష్టపడటం లేదని ఆయన అన్నారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘డేటా చోరీ కేసులో మద్దతు కోరేందుకు మమతా దీదీకి వారం రోజులుగా చంద్రబాబు ఫోన్ చేస్తున్నా అసలు మాట్లాడటానికే దీదీ ఇష్టపడటం లేదు. ఈయనకు రెండు ఎంపీ సీట్లు కూడా రావని తెలిసినప్పటి నుంచి ప్రాంతీయ పార్టీల నాయకులు లైట్ గా తీసుకుంటున్నారు. ఏమీ సేతుర లింగా అని పాడుకోవడమే మిగిలింది’ అని ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
Vijay Sai Reddy
it grids
Twitter
mamata
didi
  • Loading...

More Telugu News