Andhra Pradesh: జోరు పెంచిన గల్లా జయదేవ్.. టీడీపీ నేతలతో వరుస భేటీలు!

  • ఐదు నియోజకవర్గాల్లో ఆశావహులతో సమావేశం
  • ఇప్పటికే గుంటూరు లోక్ సభ సీటు దక్కించుకున్న జయదేవ్
  • ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ విజయానికి కృషిచేయాలని నేతలకు సూచన

గుంటూరు లోక్ సభ టీడీపీ అభ్యర్థిగా ఎంపికైన గల్లా జయదేవ్ జోరు పెంచారు. పార్టీలో నేతల మద్దతును కూడగట్టేందుకు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా గుంటూరు లోక్ సభ నియోజకవర్గంలో ఉన్న 5 అసెంబ్లీ స్థానాలను ఆశిస్తున్న నేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు.

ఈ భేటీకి టీడీపీ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్, కోవెలమూడి రవీంద్ర, మద్దాళి గిరిధర్, మన్నవ మోహనకృష్ణ, గంజి చిరంజీవి, మెహబూబ్‌ షరీఫ్‌, కూచిపూడి విజయమ్మ, మురుగుడు హనుమంతరావు, జంగాల సాంబశివరావు, షేక్‌ షౌకత్‌, కాండ్రు కమల తదితరులతో సమావేశమై పార్టీ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

ఈ సందర్భంగా నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో అధిష్ఠానం ఎవరికి టికెట్ ఇచ్చినా అభ్యర్థి గెలుపుకోసం అందరూ కృషి చేయాలని సూచించారు.

Andhra Pradesh
Telugudesam
galla jayadev
  • Loading...

More Telugu News