YSRCP: కేఏ పాల్‌కు షాకిచ్చేందుకు సిద్ధమైన ఈసీ.. అయోమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు

  • ప్రజాశాంతి పార్టీ గుర్తు మార్చాలని ఈసీని కోరిన వైసీపీ
  • పాల్‌ పార్టీకి నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం
  • తల పట్టుకుంటున్న పాల్

ప్రముఖ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ సంబరం ఆవిరైంది. ఎన్నికల సంఘం తనకు హెలికాప్టర్ గుర్తు కేటాయించడంతో ఉబ్బితబ్బిబ్బయిన పాల్.. ఇప్పుడు తలపట్టుకుంటున్నారు. ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్ తమ ఫ్యాన్ గుర్తును పోలి ఉండడంతో ఓటర్లు పొరబడే అవకాశం ఉందని, కాబట్టి దానిని తొలగించి, ఆ స్థానంలో వేరే గుర్తును కేటాయించాలంటూ వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.

వైసీపీ అభ్యర్థనతో స్పందించిన ఈసీ ప్రజాశాంతి పార్టీకి నోటీసులు జారీ చేసింది. దీంతో స్పందించిన పాల్.. వైసీపీపై మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా ఫ్యాన్, హెలికాప్టర్ గుర్తు ఒకేలా ఉండవన్నారు. ఈ రెండింటి మధ్య తేడాను ఓటర్లు గుర్తించగలరని అన్నారు. కాబట్టి తమకు తొలుత కేటాయించిన గుర్తునే కొనసాగించాలని ఈసీని కోరారు. అయితే, హెలికాప్టర్ గుర్తును పక్కనపెట్టి మరో గుర్తును కేటాయించేందుకే ఈసీ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.  

YSRCP
Prajashanthi party
Fan
Helicopter
KA Paul
Jagan
  • Loading...

More Telugu News