Mahesh Babu: కంప్యూటర్ తెరపైనే ఇలా ఉంటే ఇక వెండితెరపై ఎలా ఉంటుందో!: నమ్రత

  • సోషల్ మీడియాలో నమ్రత చాలా యాక్టివ్
  • ‘మహర్షి’ సెట్స్‌కి వెళ్లిన నమ్రత
  • చిత్రంలోని సన్నివేశాలు బాగా నచ్చాయి

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ప్రముఖ హీరోల భార్యల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ ఒకరు. తమ వ్యక్తిగత విషయాలే కాకుండా.. తన భర్త సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఆమె పంచుకుంటూ ఉంటుంది.

ప్రస్తుతం మహేశ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్‌కి కుమారుడు గౌతమ్‌తో వెళ్లిన నమ్రత కంప్యూటర్ తెరపై సినిమా చిత్రీకరణను పరిశీలించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఒక పోస్ట్ పెట్టారు. చిత్రంలోని సన్నివేశాలు బాగా నచ్చాయని.. ఈ సినిమాను కంప్యూటర్ తెరపైన చూస్తేనే ఇలా ఉందంటే.. వెండితెరపై ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఉందంటూ పోస్ట్ పెట్టారు.

Mahesh Babu
Namratha
Gowtham
Vamsi Paidipally]
Maharshi
  • Loading...

More Telugu News