Venkatesh: కేన్సర్ తో బాధపడుతున్న అభిమాని ఆకాంక్షను నెరవేర్చిన వెంకీ

  • ‘ఎఫ్2’తో మంచి సక్సెస్ అందుకున్న వెంకీ 
  • సురేశ్ ఇంటికి వెళ్లి.. ధైర్యం చెప్పారు
  • వెంకీ చొరవకు ఫిదా అవుతున్న నెటిజన్లు

ప్రముఖ నటుడు వెంకటేశ్ ప్రచార ఆర్భాటాలకు ఎప్పుడూ దూరంగా ఉంటారు. తన సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ సాధించినా.. ఒకవేళ డిజాస్టర్ అయినా కానీ పొంగిపోవడాలు.. కృంగిపోవడాలూ కనిపించవు. ఇటీవల ‘ఎఫ్2’తో మంచి సక్సెస్ అందుకున్న వెంకీ, ఇటీవలే అక్కినేని నాగ చైతన్యతో కలిసి మరో మల్టీ స్టారర్‌ను ప్రారంభించారు.

తాజాగా వెంకీ తన అభిమాని ఆకాంక్షను నెరవేర్చి వార్తల్లో నిలిచారు. సురేశ్ అనే అభిమాని బోన్ కేన్సర్‌తో బాధపడుతున్నాడు. వెంకీ తాజాగా అతనిని కలిసి ధైర్యం చెప్పి.. కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తన అభిమాని పట్ల వెంకీ చూపిన చొరవకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Venkatesh
F2
Naga chaitanya
Suresh
Bone Cancer
Social Media
  • Loading...

More Telugu News