YSRCP: మోదుగుల తన బావ కోసమే వైసీపీలో చేరారు: కోవెలమూడి రవీంద్ర ధ్వజం

  • టీడీపీకి బలం, బలగం అంతా కార్యకర్తలే
  • టీడీపీ లేకుండా చేస్తాననడం హాస్యాస్పదం
  • టీడీపీ ఎప్పుడూ సముచిత స్థానాన్నే కల్పించింది

టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నేడు ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా మోదుగుల చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. నేటి సాయంత్రం టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరులో టీడీపీ లేకుండా చేస్తానని మోదుగుల అనటం హాస్యాస్పదమని.. టీడీపీని లేకుండా చేయటం ఎవరి తరమూ కాదన్నారు.

టీడీపీకి బలం, బలగం అంతా కార్యకర్తలేనని.. ఇది నేతలను నమ్ముకుని స్థాపించిన పార్టీ కాదని రవీంద్ర పేర్కొన్నారు. టీడీపీ గుంటూరులో చాలా బలంగా ఉందని.. దానిని ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. మోదుగులను టీడీపీ ఒకసారి ఎంపీని, మరోసారి ఎమ్మెల్యేను చేసి గౌరవించిందన్నారు. ఆయన టీడీపీ నేతలను అగౌరవపరిచారు కానీ టీడీపీ ఎప్పుడూ ఆయనకు సముచిత స్థానాన్నే కల్పించిందన్నారు. మోదుగుల తన బావ కోసమే పార్టీ మారారని రవీంద్ర వ్యాఖ్యానించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News