Buggana Rajendranath Reddy: టీడీపీనే గజదొంగల పార్టీ.. వారి డేటాను దొంగిలించేవారున్నారా?: వైసీపీ నేత బుగ్గన

  • వ్యక్తిగత సమాచారం ఎందుకు తీసేయాల్సి వచ్చింది?
  • అశోక్ ఎందుకు పారిపోవాల్సి వచ్చింది?
  • స్వార్థం కోసం బలి పశువుల్ని చేస్తున్నారు

టీడీపీనే గజదొంగల పార్టీ.. వారి డేటాను దొంగిలించేవారున్నారా? అంటూ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. నేడు ఆయన హైదరాబాద్‌లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసుకు భయపడి కాంప్రమైజ్ అయి హైదరాబాద్ నుంచి వచ్చేశానని ఇటీవల సీఎం చంద్రబాబు అంగీకరించారన్నారు. మూడు కోట్ల మందికి చెందిన సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు ఎలా అందిస్తారని బుగ్గన నిలదీశారు.

 ‘సేవా మిత్ర యాప్‌లోని వ్యక్తిగత సమాచారం ఎందుకు తీసేయాల్సి వచ్చింది? అసలు ప్రైవేటు సంస్థలకు అందజేసింది.. పార్టీ డేటానా? లేదంటే ప్రజల డేటానా? దొంగతనం జరిగిందన్నప్పుడు అశోక్ ఎందుకు పారిపోవాల్సి వచ్చింది?’ అంటూ బుగ్గన ప్రశ్నల వర్షం కురిపించారు. తన స్వార్థం కోసం ప్రజలను బలి పశువులను చేస్తున్నారంటూ చంద్రబాబుపై బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Buggana Rajendranath Reddy
YSRCP
Telugudesam
Chandrababu
Ashok
  • Loading...

More Telugu News