Andhra Pradesh: ఏపీ ప్రజల డేటా పోతే ఏపీలోనే ఫిర్యాదు చేయాలి: ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు
- ఎవరూ ఫిర్యాదు చేయకుండానే ‘ఐటీ గ్రిడ్స్’ పై ఎలా దాడి చేశారు?
- ‘సేవా మిత్ర’ యాప్ ఆపేయాలని అడగడం దారుణం
- కుట్రకు స్కెచ్ అంతా విజయసాయిరెడ్డి గీశారు
ఏపీ ప్రజల డేటా పోతే ఏపీలోనే ఫిర్యాదు చేయాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎవరూ ఫిర్యాదు చేయకుండానే ఐటీ గ్రిడ్స్ సంస్థపై ఎలా దాడి చేశారు? ‘సేవా మిత్ర’ యాప్ ఆపేయాలని అడుగుతున్నారంటే వాళ్ల ఉద్దేశం ఏమిటి? అని ప్రశ్నించారు. టెక్నాలజీ వాడకంలో టీడీపీ ముందుందని వాళ్లు భయపడుతున్నారని, ఈ కుట్ర అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారం చేశారని తెలుస్తోందని, కుట్రకు స్కెచ్ అంతా విజయసాయిరెడ్డి గీశారని ఆరోపించారు.