Nara Lokesh: వైసీపీలో అవమానాలు భరించలేకే రాజీనామా చేసి.. టీడీపీలో చేరా: మహిళా నేత కొల్లి నిర్మలాకుమారి

  • వైసీపీ కోసం అంకిత భావంతో పనిచేశా
  • ఆత్మాభిమానం దెబ్బతీసేలా వ్యవహరించింది
  • మహిళా దినోత్సవం రోజున రాజీనామా చేశా

ఏపీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వలసలు భారీగా పెరిగిపోతున్నాయి. నేడు వైసీపీ మహిళా రాష్ట్ర విభాగం మాజీ అధ్య‌క్షురాలు కొల్లి నిర్మలాకుమారి టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్.. నిర్మలాకుమారికి  టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెతో పాటు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గానికి చెందిన మరికొందరు వైసీపీ నేతలను లోకేశ్ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నిర్మలా కుమారి మాట్లాడుతూ.. మొదటి నుంచీ వైసీపీ కోసం అంకిత భావంతో పనిచేశానని.. కానీ అక్కడ అవమానాలు భరించలేక రాజీనామా చేశానన్నారు. తన ఆత్మ గౌరవానికి ఎలాంటి ఇబ్బంది కలగదనే నమ్మకంతో టీడీపీలో చేరానని నిర్మలా కుమారి తెలిపారు. రాజకీయాల్లో ఓ మహిళ ఎదగడమంటే సాధారణ విషయం కాదన్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడితే వైసీపీ అధిష్ఠానం తన ఆత్మాభిమానం దెబ్బతీసేలా వ్యవహరించిందన్నారు. వైసీపీలో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ.. మహిళా దినోత్సవం రోజున తాను రాజీనామా చేశానన్నారు.    

Nara Lokesh
Nirmala kumari
YSRCP
Telugudesam
East Godavari District
  • Loading...

More Telugu News