Andhra Pradesh: ఇతర రాష్ట్రాల్లోని ఏపీ వ్యాపారులు, ఉద్యోగస్తులను భయపెడుతున్నారు!: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

  • ఎన్నికల్లో గెలవలేమన్న భయంతోనే వైసీపీ కుట్ర
  • వీటికి బెదిరిపోయే ప్రసక్తే లేదు
  • తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఏపీ మంత్రి

ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న ఏపీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో గెలవలేమన్న భయంతోనే ప్రతిపక్ష వైసీపీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. ఇలాంటి కుట్రలకు బెదిరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. వీఐపీ ప్రారంభదర్శన సమయంలో తిరుమల శ్రీవారిని మంత్రి సోమిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 70 ఏళ్ల భారతదేశ చరిత్రలో రాజ్యాంగానికి వెన్నుపోటు పొడిచే పరిస్థితికి వచ్చారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీ, తెలంగాణ నేతలు వైసీపీని చెప్పుచేతల్లో పెట్టుకుని ఏపీని అణగదొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణలో లక్షల ఓట్లను తొలగించినట్లు ఏపీలో కూడా ప్రజల ఓట్లను తీసేయాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ భవిష్యత్ బాగుండాలంటే చంద్రబాబే మరోసారి సీఎం కావాలని స్పష్టం చేశారు.

Andhra Pradesh
Telangana
New Delhi
BJP
Congress
YSRCP
Telugudesam
somireddy
chandramohan reddy
Tirumala
  • Loading...

More Telugu News