Krishna District: కొడాలి నానికి పోటీగా దేవినేని అవినాశ్: గుడివాడలో హోరాహోరీయేనా?

  • తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న అవినాశ్ ‌
  • వ్యూహాత్మక ప్రయోగం చేయాలన్న యోచనలో టీడీపీ
  • గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలిచిన నాని

కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి వ్యూహాత్మక ప్రయోగం చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఇక్కడ వైసీపీ బలమైన అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి దీటుగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ‌ను రంగంలోకి దించాలని ప్రయత్నిస్తోంది. ఈ అంశంపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారని, త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి నాని స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. కాగా, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ 1983, 1985 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీచేసి దాదాపు 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Krishna District
gudivada
Kodali Nani
devineni avinash
  • Loading...

More Telugu News