Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్.. ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నేత!

  • నెల్లూరు జిల్లా వైసీపీ ఆఫీసులో టెన్షన్
  • పోలీసులు, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం
  • వైసీపీ కార్యకర్తల అరెస్టుపై పోలీసులను నిలదీసిన కోటంరెడ్డి

వైసీపీ నేత, నెల్లూరు గ్రామీణం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. తమ విధులకు ఎమ్మెల్యే ఆటంకం కలిగించారని కేసు నమోదు చేసిన వేదాయపాలెం పోలీసులు.. కోటంరెడ్డిని ఐదోనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అంతకుముందు కోటంరెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు జిల్లా వైసీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. విజయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు కూడా భారీగా అక్కడకు వచ్చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా భారీ బందోబస్తు నడుమ పోలీసులు కోటంరెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. కాగా, తనను విడుదల చేసేవరకూ ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని కోటంరెడ్డి ప్రకటించారు. అక్రమ సర్వేలు చేస్తున్నవారిని వైసీపీ కార్యకర్తలు పట్టుకుంటే వారిపైనే ఎదురుకేసులు పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Andhra Pradesh
Nellore District
YSRCP
Telugudesam
Police
kotamreddy
sreedhar reddy
  • Loading...

More Telugu News