nani: వేడెక్కుతోన్న 'గ్యాంగ్ లీడర్' టైటిల్ గొడవ

  • విడుదలకి ముస్తాబవుతోన్న 'జెర్సీ'
  • విక్రమ్ కుమార్ తో సెట్స్ పైకి
  •  మాణిక్యం మూవీస్ నిర్మాత ఆరోపణ    

ప్రస్తుతం నాని 'జెర్సీ' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో వున్నాడు. తరువాత సినిమాను ఆయన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాకి 'గ్యాంగ్ లీడర్'అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ టైటిల్ పైనే ఇప్పుడు ఫైట్ జరుగుతోంది. ఈ టైటిల్ ను తాము 6 నెలల క్రితమే రిజిస్టర్ చేయించామనీ, ఆ టైటిల్ ను నాని వాళ్లు కాజేశారు అని మాణిక్యం మూవీస్ నిర్మాత మోహన్ కృష్ణ గొడవకి దిగారు.

ఇస్తే మెగా ఫ్యామిలీకి ఈ టైటిల్ ను ఇస్తామనీ .. వేరెవరికీ ఇవ్వమని ఆయన విలేకరుల సమావేశంలో చెప్పారు. ఉగాది నుంచి తమ సినిమా షూటింగు మొదలవుతుందనీ, గోదావరి జిల్లాల్లో 40 రోజుల పాటు ఏకధాటిగా కొనసాగుతుందని చెప్పారు. ఆగస్టు 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నామని అన్నారు. ప్రస్తుతం ఫిల్మ్ చాంబర్లో ఈ సమస్యకి పరిష్కారం వెదుకుతున్నారు. చివరికి ఈ టైటిల్ ఎవరికి దక్కుతుందో చూడాలి.

  • Loading...

More Telugu News