Andhra Pradesh: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు!

  • పిల్లలతో టీఆర్ఎస్ జెండాలు మోయించారు
  • ఎన్నికల కోడ్ ను కేటీఆర్ ఉల్లంఘించారు
  • ఈసీకి బీజేపీ నేత రామచంద్రరావు ఫిర్యాదు

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కరీంనగర్ లో టీఆర్ఎస్ సభ సందర్భంగా కేటీఆర్ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆరోపించారు. ఈ సభ నేపథ్యంలో విద్యార్థులతో టీఆర్ఎస్ జెండాలను మోయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను అతిక్రమించిన కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు తన ఫిర్యాదును ఫ్యాక్స్ ద్వారా రామచంద్రరావు ఈసీకి పంపారు.

Andhra Pradesh
Telangana
BJP
TRS
election commission
complaint
  • Loading...

More Telugu News